క్రిష్ .. వైష్ణవ్ తేజ్ మూవీ ఇప్పట్లో రానట్టే!
- క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'కొండపొలం'
- మేకప్ లేకుండా చేసిన రకుల్
- 45 రోజులో పూర్తయిన షూటింగ్
- వచ్చే ఏడాదిలోనే విడుదల
గ్రామీణ నేపథ్యంలో రూపొందిన కథ ఇది .. ఈ సినిమాలో రకుల్ మేకప్ లేకుండగా నటించిందని అంటున్నారు. ఈ సినిమా షూటింగును క్రిష్ 45 రోజులలో పూర్తి చేశారు. దాంతో త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ ఏడాదిలో ఈ సినిమా రాదని తెలుస్తోంది. అందుకు కారణం వీఎఫ్ ఎక్స్ అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి వీఎఫ్ ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిసెంబర్ వరకూ ఈ వర్క్ పూర్తయ్యే అవకాశం లేదట. అందువలన ఈ సినిమా విడుదల వచ్చే ఏడాదిలోనే అంటున్నారు.