'గుడంబా శంకర్' క్లైమాక్స్ మారిస్తే హిట్ కొట్టేదంటున్న దర్శకుడు!
- 2004లో వచ్చిన 'గుడుంబా శంకర్'
- అంచనాలను అందుకోలేకపోయిన సినిమా
- క్లైమాక్స్ నచ్చకపోవడమే కారణమన్న దర్శకుడు
"పవన్ కోసం ముందుగా నేను 'టైగర్ సీతారాముడు' అనే టైటిల్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వలన 'గుడుంబా శంకర్' చేయవలసి వచ్చింది. క్లైమాక్స్ ను యాక్షన్ ఎపిసోడ్ తో ఎండ్ చేద్దామని నేను అంటే, అలా చేస్తే రొటీన్ అవుతుందని పవన్ అన్నారు. ముగింపు నేచురల్ గా ఉండేలా చూద్దామని చెప్పారు. అవసరమైతే ఎడిటింగ్ అయ్యాక ముందుగా అనుకున్న క్లైమాక్స్ చేద్దామని చెప్పారు. కానీ అలా చేయకుండానే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లింది .. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా క్లైమాక్స్ మార్చకుండా ఉంటే హిట్ కొట్టేదేనని చెప్పుకొచ్చాడు.