'శాకినీ .. ఢాకిని'గా రెజీనా, నివేదా!
- కొరియన్ రీమేక్ గా 'శాకినీ .. ఢాకిని'
- దర్శకుడిగా సుధీర్ వర్మ
- తొలి షెడ్యూల్ పూర్తి
ఈ సినిమాలో రెజీనా .. నివేద ఇద్దరూ కూడా ట్రైనీ పోలీసులుగా కనిపిస్తారట. అలాంటి వీరిద్దరూ ఓ అమ్మాయి కిడ్నాప్ కేసును ఛేదించవలసి వస్తుంది. అప్పుడు వాళ్లు ఏం చేశారు? పర్యవసానాలు ఎలాంటివి? అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో రెజీనా .. నివేదా ఫైటింగులు కూడా చేసేస్తారట. ఆల్రెడీ ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుందట. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా, త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు.