డౌట్ లేదు .. సంక్రాంతికే 'హరిహర వీరమల్లు'
- చారిత్రక నేపథ్యంలో సాగే 'హరిహర వీరమల్లు'
- సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది
- క్రిష్ ప్లానింగ్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది
అయితే కరోనా కారణంగా చాలా సినిమాల షూటింగులు వాయిదాపడ్డాయి. అలాగే విడుదల తేదీలను కూడా వాయిదా వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 'హరిహర వీరమల్లు' కూడా సంక్రాంతికి రాకపోవచ్చనే ఒక టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై ఎ.ఎమ్.రత్నం స్పందిస్తూ .. " సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది .. ఇక క్రిష్ తాను అనుకున్న సమయానికంటే ముందుగానే షూటింగు పూర్తి చేసే దర్శకుడు. అందువలన 'హరిహర వీరమల్లు' విడుదలను వాయిదా వేసే పరిస్థితి రాదు. సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.