Akhil: చరణ్ కోసం అనుకున్న కథ అఖిల్ కి వెళ్లిందట!

Akhil movie script is written for charan

  • దాదాపు విదేశాల్లోనే షూటింగ్
  • భారీగా ఖర్చు చేసిన నితిన్
  • అంచనాలను అందుకోలేకపోయిన కథ

అఖిల్ తొలి సినిమా ఆయన పేరుతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో నితిన్ నిర్మించిన ఈ సినిమాకి వినాయక్ దర్శకత్వం వహించాడు. సాయేషా సైగల్ కూడా ఈ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమైంది. దాదాపుగా విదేశాల్లో .. అక్కడి దట్టమైన అడవుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ కొనసాగింది. 'అఖిల్' సినిమాపై అభిమానులు ఒక రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాను గురించి రచయిత వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడాడు.

'అఖిల్' సినిమా కథను నేను చరణ్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ. అప్పటికే చరణ్ స్టార్ హీరోగా తనని తాను నిరూపించుకున్నాడు. అందువలన ఆయన క్రేజ్ కి తగిన విధంగా కథను రాసుకున్నాను. కానీ అఖిల్ దగ్గరికి వచ్చేసరికి కథలో కొన్ని మార్పులు చేయవలసి వచ్చింది. ఫస్టు సినిమా కావడం వలన అఖిల్ ను ఆ కథలో మరింత హైలైట్ చేస్తూ చూపించవలసి వచ్చింది. అక్కడే తేడా కొట్టేసిందని నేను అనుకుంటున్నాను. చరణ్ తో ఈ కథను చేసి ఉంటే మరోలా ఉండేది" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ కథను చరణ్ కోసం అనుకున్నారనే విషయం ఇప్పుడు ఇలా బయటికి వచ్చిందన్న మాట.

Akhil
Sayyesha Saigal
VV Vinayak
  • Loading...

More Telugu News