ధనుశ్ 'జగమే తంత్రం' రిలీజ్ ఓటీటీలోనే!
- కార్తీక్ సుబ్బరాజ్ తాజా చిత్రంగా 'జగమే తంత్రం'
- గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ధనుశ్
- కథానాయికగా ఐశ్వర్య లక్ష్మి
అలాంటి ధనుశ్ నుంచి తాజాగా వచ్చిన 'కర్ణన్' సినిమా, ఈ ఏడాది సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత 'జగమే తంతిరమ్' సినిమా కూడా థియేటర్లకు వస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జూన్ 11వ తేదీన గానీ 13వ తేదీన గాని ఈ సినిమాను స్ట్రీమింగ్ కి పెట్టాలనే విషయంపై చర్చలు నడుస్తున్నాయట. రిలీజ్ డేట్ తో ట్రైలర్ ను మే 14వ తేదీన వదలాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగులో 'జగమే తంత్రం' టైటిల్ తో పలకరించనుంది. కెరియర్ పరంగా ధనుశ్ కి ఇది 40వ సినిమా. ఆయన సరసన ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించింది. గ్యాంగ్ స్టర్ గా ధనుశ్ నటించిన ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.