అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దు.. ప్లీజ్: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా
- మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
- అందరూ విధిగా మాస్కు ధరించాలి
- మీ కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం జాగ్రత్తలు పాటించండి
- అవసరాన్ని బట్టి ఇరుగు, పొరుగుకు సాయం చేయండి
ఈ పరిస్థితుల్లో అందరూ ఇళ్లలోనే ఉండాలని అభ్యర్థిస్తున్నట్టు ప్రియాంక చెప్పుకొచ్చారు. మీ కోసం, మీ కుటుంబం కోసం, మన బంధువులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం దీనిని పాటించాలని సూచించారు. బయటకు వెళ్లిన ప్రతిసారీ మాస్కులు ధరించాలని, అవసరాన్ని బట్టి చుట్టుపక్కల వారికి సాయం చేయాలని ప్రియాంక పేర్కొన్నారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరిన ప్రియాంక.. మనం తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలు వైద్య రంగంపై ఒత్తిడి తగ్గిస్తాయన్నారు.