భారీ రేటుకు 'అఖండ' హక్కులు!
- డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న బాలయ్య
- ప్రతినాయకుడి పాత్రలో ఆసక్తిని రేపనున్న శ్రీకాంత్
- క్రేజీ కాంబినేషన్ కావడంతో భారీగా బిజినెస్
ఈ సినిమా శాటిలైట్ .. డిజిటల్ రైట్స్ ను 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్', 'స్టార్ మా' వారు దక్కించుకున్నట్టుగా సమాచారం. ఈ రెండు హక్కుల నిమిత్తం 13 నుంచి 15 కోట్ల వరకూ డీల్ కుదిరినట్టుగా చెబుతున్నారు. బాలకృష్ణ కెరియర్లో అత్యధిక రేటు పలికిన సినిమా ఇదేనని అంటున్నారు. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ కి గల క్రేజ్ కారణంగానే ఈ సినిమాకి ఈ స్థాయి రేటు పలికిందని చెబుతున్నారు. రైతుగా .. అఘోరగా డిఫరెంట్ లుక్స్ తో బాలకృష్ణ కనిపించనుండటం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.