మరో బాలీవుడ్ ప్రాజెక్టును ఓకే చేసిన ప్రభాస్!
- ముగింపు దశలో 'రాధే శ్యామ్'
- సెట్స్ పై 'సలార్' .. 'ఆది పురుష్'
- సిద్ధార్థ్ ఆనంద్ కి గ్రీన్ సిగ్నల్
ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్'ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పాన్ ఇండియా సినిమాలుగా రూపొందుతున్న 'సలార్' .. 'ఆది పురుష్' రెండూ కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఆ తరువాత సినిమాను ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలన్నీ కూడా ఒకదానికొకటి ఎంతమాత్రం దగ్గర సంబంధం లేనివే. ఒక్కోక్కటి ఒక్కో జోనర్ కి చెందినవే. ఈ నేపథ్యంలోనే.. 'వార్' వంటి భారీ యాక్షన్ సినిమాను తెరకెక్కించిన సిద్ధార్థ్ ఆనంద్ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొంతకాలంగా చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు ఖాయమైపోయిందట. త్వరలోనే ఇతర వివరాలు తెలియనున్నాయి.