దిల్ రాజు నుంచి భారీ పారితోషికం అందుకోనున్న శంకర్!
- భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్
- చరణ్ తో శంకర్ మూవీని సెట్ చేసిన దిల్ రాజు
- కథపై కసరత్తు చేస్తున్న శంకర్
అలాంటి శంకర్ ఒక వైపున 'ఇండియన్ 2' సెట్స్ పై ఉండగానే, మరో వైపున చరణ్ సినిమాను అంగీకరించడం విశేషం. 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ కథానాయకుడిగా నటించనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అంతేకాదు ఈ స్థాయి దర్శకుడితో ఆయన చేస్తున్న తొలి సినిమా కూడా ఇదే. ఒక నిర్మాతగా దర్శకుడికి అత్యధిక పారితోషికం చెల్లిస్తుండటమనేది కూడా ఈ సినిమాతోనే జరుగుతోంది. ఇక శంకర్ నేరుగా తెలుగులో చేస్తున్న పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇంకా ఈ ప్రాజెక్టులో ఎన్ని విశేషాలు చోటు చేసుకుంటాయో చూడాలి.