రవితేజ దూకుడు .. కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించేశాడు!
- మరో కొత్త దర్శకుడికి రవితేజ ఛాన్స్
- కథానాయికగా 'దివ్యాన్ష కౌశిక్'
- ఈ నెల నుంచే రెగ్యులర్ షూటింగ్
'ఉగాది' పండుగను పురస్కరించుకుని, ఈ సినిమా కొంతసేపటి క్రితమే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కరోనా తీవ్రత కారణంగా చాలా సింపుల్ గా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవుడి చిత్రపటాలపై రవితేజ క్లాప్ ఇవ్వగా, ఈ సినిమా షూటింగును లాంఛనంగా ప్రారంభించారు. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాకి, సత్య సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. నాగచైతన్య జోడీగా 'మజిలీ' సినిమాతో పరిచయమైన 'దివ్యాన్ష కౌశిక్' ఈ సినిమాలో కథానాయికగా అలరించనుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ నెలలోనే మొదలుకానుంది.