రజనీ .. కమల్ ఇద్దరి టార్గెట్ దీపావళినే!
- రజనీకాంత్ హీరోగా 'అన్నాత్తే'
- కమల్ కథనాయకుడిగా 'విక్రమ్'
- ఆందరిలో పెరుగుతోన్న ఆసక్తి
రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు శివ 'అన్నాత్తే' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశంతో, క్రితం ఏడాది షూటింగును మొదలుపెట్టారు. కానీ లాక్ డౌన్ కారణంగా ప్లాన్ మారిపోయింది. ఇప్పటికే ఇంకా షూటింగే పూర్తి చేసుకోలేదు. ఈ దీపావళికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మాత్రం చెప్పారు. ఇక లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ 'విక్రమ్' సినిమా చేస్తున్నాడు. ఇది కమల్ సొంత సినిమా .. దీనిని దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దాంతో ఈ రెండు సినిమాలు ఒకేసారి థియేటర్లలో దిగితే పరిస్థితి ఏమిటనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.