'మేజర్' నుంచి శోభిత ధూళిపాళ్ల ఫస్టులుక్
- అడివి శేష్ నుంచి మరో మూవీ
- ఈ నెల 12వ తేదీన టీజర్ రిలీజ్
- జూలై 2వ తేదీన సినిమా విడుదల
అలా ఆయన తాజా చిత్రంగా 'మేజర్' సినిమా రూపొందుతోంది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, సయీ మంజ్రేకర్ - శోభిత ధూళిపాళ్ల ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఒక్కో పోస్టర్ ను వదులుతూ అంచనాలు పెంచుతున్నారు.
తాజాగా 'మేజర్' సినిమా నుంచి శోభిత ధూళిపాళ్ల ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ఆమె ఎన్నారై పాత్రలో కనిపించనుంది. శోభిత ఒక పాపను ఎత్తుకుని రక్షించే ప్రయత్నంలో ఉన్నట్టుగా భయంతో కనిపిస్తోంది. 'ఆమెకి ధైర్యం లేదు .. కానీ వేరే మార్గం లేదు' అంటూ వదిలిన ఈ పోస్టర్, సినిమాపై ఆసక్తిని .. అంచనాలను పెంచేస్తోంది. ఈ నెల 12వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్న విషయాన్ని ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు. మహేశ్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను, జూలై 2వ తేదీన విడుదల చేయనున్నారు.