కరోనా ఎఫెక్ట్ తో 'లవ్ స్టోరీ' రిలీజ్ వాయిదా?
- చైతూ - సాయిపల్లవి జోడీగా 'లవ్ స్టోరీ'
- అంచనాలు పెంచిన 'సారంగధరియా' సాంగ్
- ముందుగా చెప్పిన రిలీజ్ డేట్ ఈ నెల 16
రామ్మోహన్ రావు - నారాయణ దాస్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 16వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆ రోజున థియేటర్లకు రాకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. కరోనా తీవ్రత కారణంగా కొంతకాలం పాటు ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలని వాళ్లు భావించినట్టుగా చెప్పుకుంటున్నారు. 'సారంగధరియా ..' పాట వదిలిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రిలీజ్ డేట్ కోసం అంతా ఎదురుచూస్తున్న సమయంలో ఈ టాక్ రావడం విచారించదగిన విషయమే.