నాకు కరోనా సోకిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు: అంజలి
- టాలీవుడ్ లో కరోనా కలకలం
- పలువురు సినీ తారలకు పాజిటివ్
- అంజలికి కూడా కరోనా అంటూ ప్రచారం
- ఓ ప్రకటనలో ఖండించిన అంజలి
- తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడి
తనకు కరోనా లేదని సంతోషంగా చెబుతున్నానని అంజలి ఓ ప్రకటనలో పేర్కొంది. అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలని సూచించింది. అంజలి నటించిన 'వకీల్ సాబ్' చిత్రం రేపు విడుదల కానుంది. ఈ చిత్రంలో నటించిన నివేదా థామస్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.