రవితేజ కామెడీ ఎంటర్టైనర్ కి ముహూర్తం ఖాయమైనట్టే!
- 'క్రాక్'తో దక్కిన భారీ హిట్
- షూటింగు దశలో 'ఖిలాడీ'
- వచ్చేనెలలో కొత్త ప్రాజెక్టుతో సెట్స్ పైకి
ఇక 'ఖిలాడి' తరువాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఒక కామెడీ ఎంటర్ టైనర్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత వాళ్లు ఆ విషయాన్ని ధ్రువీకరించారు కూడా. త్రినాథరావు నక్కిన నుంచి 'సినిమా చూపిస్తమావ' .. 'నేను లోకల్' వంటి సూపర్ హిట్లు ఉండటంతో, అందరిలోను ఈ ప్రాజెక్టుపై ఆసక్తి ఉంది. వచ్చేనెలలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారనేది తాజా సమాచారం. త్వరలోనే డేట్ ఎనౌన్స్ చేయనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ జోడీగా రాశి ఖన్నా కనువిందు చేయనుంది.