నాగ్ నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ మూవీ ఖాయమైనట్టే!
- 'ఉప్పెన'తో హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్
- క్యూ కడుతున్న అవకాశాలు
- క్లారిటీ ఇచ్చిన నాగార్జున
నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో వైష్ణవ్ తేజ్ ఒక సినిమా చేయనున్నాడనే వార్తలో, ఎంతవరకూ నిజం ఉందనేది సందేహంగా మారింది. అలాంటి సందేహాలకు నాగార్జున తెరదించేశారు. నాగార్జున హీరోగా 'వైల్డ్ డాగ్' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమా రేపు భారీస్థాయిలో విడుదలవుతోంది. దాంతో నాగార్జున ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. అదే సమయంలో వైష్ణవ్ తేజ్ తో సినిమాను గురించి ప్రశ్నించగా, అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని నాగార్జున చెప్పారు. వైష్ణవ్ తేజ్ కు కథ చాలా బాగా నచ్చిందనీ, ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడని అన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబధించిన ప్రకటన చేస్తాం" అని చెప్పుకొచ్చారు.