హిందీ 'విక్రమ్ వేధ'లో హృతిక్, సైఫ్ అలీఖాన్
- తమిళంలో హిట్ అందుకున్న విక్రమ్ వేధ
- సైఫ్ పోలీస్ అధికారి పాత్రలో
- హృతిక్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించే అవకాశం
- హృతిక్‌కు 25వ సినిమా
ఇది హృతిక్ 25వ సినిమా కూడా కావడంతో ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించేందుకు మేకర్లు శ్రమిస్తున్నారు. తమిళంలో దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రి ద్వయమే హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కించనున్నారని సమాచారం. గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్‌ను తనదైన శైలిలో పండించేందుకు హృతిక్ సంసిద్ధమవుతున్నాడని.. బాడీలాంగ్వేజ్, లుక్ పరంగా కసరత్తు చేస్తున్నాడని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. విక్రమ్ వేధ హిందీ రీమేక్‌కు ఇంకా పేరు ఖరారు కాలేదు. షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభం కానుందని సమాచారం.