తెరపైకి సంగీత మాంత్రికుడు రెహ్మాన్!
- మోహన్ లాల్ హీరోగా 'అరాట్టు' సినిమా
- సంగీతాన్ని సమకూరుస్తున్న రెహ్మాన్
- రెహ్మాన్, మోహన్ లాల్ లపై పాట షూట్
- ఫొటో షేర్ చేసిన మోహన్ లాల్
అలాంటి రెహ్మాన్ త్వరలో తెరపై తళుక్కుమననున్నాడు. అవును, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలసి ఆయన ఓ సినిమాలో నటిస్తున్నాడు. బి.ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా ప్రస్తుతం 'అరాట్టు' అనే మలయాళ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి రెహ్మాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అంతేకాదు, ఇందులో మోహన్ లాల్ తో కలసి ఆయన ఓ పాటలో డ్యాన్స్ చేస్తున్నాడు.
ఇక ఈ పాటను నిన్నటి నుంచి చెన్నైలో స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని మోహన్ లాల్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ, మ్యూజిక్ మ్యాస్ట్రో రెహ్మాన్ తో షూటింగులో పాల్గొనడం గొప్ప అనుభవం అంటూ పోస్ట్ పెట్టారు. అలాగే ఆ సెట్లో దర్శకుడితో కలసి వీరిద్దరూ దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు.