సినీ రంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రానా
- విలక్షణ పాత్రలతో ముందుకెళుతున్న రానా
- అరణ్య చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు
- నటులు, దర్శకుల భాషతో సినీ రంగానికి పట్టింపు లేదన్న రానా
- ప్రేక్షకులకు సైతం సినిమా కంటెంటే ముఖ్యమని వెల్లడి
ప్రేక్షకులు సైతం ఒక్కసారి టికెట్ కొనుక్కుని థియేటర్ లోకి వెళ్లారంటే ఆ సినిమా ఎవరు నిర్మించారన్నది పట్టించుకోరని, సినిమాలో ఉన్న కంటెంట్ పైనే దృష్టి నిలుపుతారని రానా వివరించారు. ఉదాహరణకు అవెంజర్స్ సినిమానే తీసుకుంటే అది ఏ భాష అన్నది ప్రేక్షకులు పట్టించుకోరని, సినిమానే ముఖ్యమని పేర్కొన్నారు. భాష సరిహద్దులను ఇంటర్నెట్, మీడియా తొలగించాయని అన్నారు.