నాగార్జునకు జోడీగా కాజల్ అగర్వాల్.. అధికారిక ప్రకటన
- పెళ్లయినా కాజల్ కు అవకాశాలు
- 'ఆచార్య'లో చిరంజీవికి జోడీ
- ప్రవీణ్ సత్తారు సినిమాలో ఛాన్స్
- గోవాలో జరుగుతున్న షూటింగ్
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో కథానాయికగా కాజల్ ను ఖరారు చేశారు. ఈ రోజు ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తమ టీమ్ లోకి కాజల్ ని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో మేకర్స్ ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. త్వరలోనే కాజల్ ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతుంది.