బాలీవుడ్ నటి రియాకు బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎన్‌సీబీ
- డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి
- గతేడాది అక్టోబరు 7న బెయిలు మంజూరు
- ఎన్ఎస్‌బీ పిటిషన్‌పై 18న విచారణ
రియా బెయిలును రద్దు చేయాలంటూ తాజాగా మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సీబీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను ఎల్లుండి (18న) విచారిస్తామని చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.