'ఆర్ఆర్ఆర్' నుంచి మార్చి 15న అలియా ఫస్ట్ లుక్ రిలీజ్
- రాజమౌళి డైరెక్షన్లో 'ఆర్ఆర్ఆర్'
- హీరోలుగా రామ్ చరణ్, ఎన్టీఆర్
- సీత పాత్ర పోషిస్తున్న అలియా భట్
- 'ఆర్ఆర్ఆర్' లో రామ్ చరణ్ కు జోడీ
ఈ నేపథ్యంలో అలియా ఫస్ట్ లుక్ ను మార్చి 15న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్చి 15న అలియా భట్ పుట్టినరోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
"దివ్యతేజస్సుతో అలరారే మా సీత వస్తోంది... చూడండి" అంటూ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ ట్వీట్ చేసింది. మార్చి 15న ఉదయం 11 గంటలకు అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నామని వెల్లడించింది.