నాగార్జున సినిమాలో కీలక పాత్రలో భూమిక!
- నాగార్జున కథానాయకుడుగా 'బంగార్రాజు'
- కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా
- నెగటివ్ టచ్ తో సాగే పాత్రలో భూమిక
- వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల
ఆమధ్య నాగార్జున హీరోగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలోని బంగార్రాజు పాత్ర బాగా పాప్యులర్ అయింది. దాంతో ఆ పాత్ర పేరునే టైటిల్ గా తీసుకుని నాగార్జున మరో సినిమా చేస్తున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' దర్శకుడు కల్యాణ్ కృష్ణ దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ 'బంగార్రాజు' చిత్రంలో ఓ కీలక పాత్రకు భూమికను ఎంపిక చేసినట్టు, ఆమె పాత్ర నెగటివ్ టచ్ తో సాగుతుందని తెలుస్తోంది. త్వరలో షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.