పవన్ ను కలిసిన ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయిపోతున్న బిగ్ బాస్ భామ
- క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న పవన్
- సెట్స్ పై పవన్ ను కలిసిన అషూ రెడ్డి
- పవన్ 2 గంటల సేపు మాట్లాడాడని వెల్లడి
- వెళ్లేటప్పుడు పవన్ నుంచి లేఖ
- గతంలో పవన్ పేరును టాటూ వేయించుకున్న అషూ
ఏదో కొన్ని నిమిషాలు మాట్లాడి పంపిస్తాడని ఆమె భావించినా, పవన్ ఆమెతో ఏకంగా 2 గంటల పాటు ఆప్యాయంగా ముచ్చటించడం విశేషం. ఈ సందర్భంగా పవన్ తన టాటూ సంగతి ప్రస్తావించాడని చెప్పి అషూ మురిసిపోతోంది. గతంలో తన శరీరంపై పవన్ కల్యాణ్ పేరును ఈ బబ్లీ గాళ్ పచ్చబొట్టు పొడిపించుకున్న సంగతి తెలిసిందే.
ఇక, తాజా మీటింగ్ విషయానికొస్తే పవన్... ఈ భామకు ఓ లెటర్ కూడా అందించాడట. ఆ లెటర్ ను తనే ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. మీరు కోరుకున్నవన్నీ జరగాలని ఆశిస్తున్నాను అంటూ పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో అషూ ఆనందం అంబరాన్నంటుతోంది. పవన్ ను కలవడమే ఓ గోల్డెన్ చాన్స్ అయితే, ఏకంగా రెండు గంటల సేపు అపాయింట్ మెంట్ దొరకడం, పైగా పవర్ స్టార్ స్వయంగా లేఖ ఇవ్వడం అషూని నిలవన్వివడంలేదు.