మనవడి కోసం మేకను బలిచ్చిన ఎస్సై... సస్పెండ్ చేసిన అధికారులు
- రాజస్థాన్ లో ఘటన
- మనవడి కేశఖండన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై
- ఆలయంలో మేకను బలిచ్చి బంధుమిత్రులకు విందు
- వైరల్ గా మారిన వీడియో
- విచారణకు ఆదేశించిన కోట జిల్లా రూరల్ ఎస్పీ
అయితే ఎస్సై భన్వర్ సింగ్ మేకను బలి ఇచ్చిన విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోట జిల్లా గ్రామీణ ఎస్పీ శరద్ చౌదరి విచారణకు ఆదేశించారు. ఎస్సై భన్వర్ సింగ్ మేకను బలిచ్చిన విషయం నిర్ధారణ కావడంతో అతడిని వెంటనే సస్పెండ్ చేసి, పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు.