పవన్, క్రిష్ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు!
- క్రిష్ దర్శకత్వంలో పవన్ పిరీడ్ ఫిలిం
- కథానాయికలుగా నిధి, జాక్వెలిన్
- ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్
- పరిశీలనలో 'హరిహర వీరమల్లు' టైటిల్
ఇక ఇది మొఘలాయీల పాలన నాటి కాలంలో జరిగే చారిత్రాత్మక కథతో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం. ఇందులో పవన్ వజ్రాలదొంగగా వెరైటీ పాత్రలో కనిపిస్తారట. ఇందులో కథానాయికలుగా నిధి అగర్వాల్.. బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు.
ఈ చిత్రంలో కీలకమైన పాత్ర ఒకటి ఉందట. అదే మొఘలాయీ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర. ఈ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ పోషించనున్నట్టు తాజా సమాచారం. ఈ చిత్రానికి మొదటి నుంచీ రకరకాల టైటిల్స్ ప్రచారంలో వున్నాయి. అయితే, తాజాగా 'హరిహర వీరమల్లు' అనే పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు.