ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ భామ!
- 'ఆర్ఆర్ఆర్' తర్వాత త్రివిక్రమ్ తో ఎన్టీఆర్
- దాదాపు పూర్తయిన ప్రీ ప్రొడక్షన్ పనులు
- సెకండ్ హీరోయిన్ గా వరీన హుస్సేన్?
- 'లవ్ యాత్రి'తో బాలీవుడ్ కి పరిచయం
అదే కోవలో త్వరలో మరో బాలీవుడ్ భామ వరీన హుస్సేన్ కూడా టాలీవుడ్ ప్రవేశం చేయనున్నట్టు తెలుస్తోంది. పైగా, ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్ నటించే సినిమా ద్వారా ఆమె పరిచయం కానుండడం విశేషం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగులో పాల్గొంటాడు.
ఇక ఇందులో ఇద్దరు కథానాయికలు నటిస్తారని, వీరిలో రెండో కథానాయిక పాత్రకు ఇప్పుడు వరీన హుస్సేన్ ను ఎంపిక చేశారనీ తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల హైదరాబాదులో ఆమెకు టెస్ట్ షూట్ కూడా చేసి దర్శకుడు త్రివిక్రమ్ సంతృప్తిని వ్యక్తం చేశాడట. దాంతో ఆమెను ఫైనల్ చేసినట్టు సమాచారం. సల్మాన్ ఖాన్ నిర్మించిన 'లవ్ యాత్రి' సినిమా ద్వారా వరీన బాలీవుడ్ కి పరిచయమైంది. ఇదిలావుంచితే, ఈ సినిమాలో నటించే ప్రధాన నాయిక ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదని అంటున్నారు.