అయోధ్య రామాలయంపై మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
- రామాలయం నిర్మాణంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వివాదాస్పద వ్యాఖ్యలు
- తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన చల్లా ధర్మారెడ్డి
- అయోధ్యలో కట్టే రామ మందిరం మాకెందుకని వ్యాఖ్య
తాజా వ్యాఖ్యలు చేసింది పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. మనకు భద్రాచలంలో రాముడు లేడా? అని ధర్మారెడ్డి ప్రశ్నించారు. అయోధ్యలో కట్టే రామ మందిరం మాకెందుకు? అని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.