సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'సలార్'లో శ్రుతిహాసన్ కు ఛాన్స్?
- ఈ 29న 'మాస్టర్' డిజిటల్ ప్రీమియర్
- 'క్రాక్' హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్
* తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'మాస్టర్' చిత్రం ఈ నెల 9న విడుదలై, తెలుగు, తమిళ భాషల్లో మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 29న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
* రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'క్రాక్' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించే అవకాశం కనిపిస్తోంది. ఆమధ్య 'అర్జున్ రెడ్డి' చిత్రం రీమేక్ లో నటించిన షాహిద్.. ప్రస్తుతం 'జెర్సీ' చిత్రం హిందీ రీమేక్ లో కూడా నటిస్తుండడం గమనార్హం.