హైదరాబాదులో పవన్, రానా చిత్రం షూటింగ్ ప్రారంభం
- 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి తెలుగు రీమేక్
- సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సినిమా
- ప్రధానపాత్రల్లో పవన్ కల్యాణ్, రానా
- హైదరాబాదు అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ
కేరళలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతర తారాగణం పేర్లు ప్రకటించాల్సి ఉంది. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్, రానా కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి బిల్లా-రంగా అనే టైటిల్ ప్రచారంలో ఉంది.