బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో తెరపైకి మరో వ్యక్తి!
- కిడ్నాప్ వ్యవహారంలో సిద్ధార్థ అనే వ్యక్తి పాత్రను గుర్తించిన పోలీసులు!
- సిద్ధార్థ స్వస్థలం విజయవాడ
- గతంలో అఖిలప్రియ దంపతులకు బౌన్సర్ గా వ్యవహరించిన వైనం
- భార్గవరామ్ సూచనలతో కిడ్నాప్ కు మనుషుల సరఫరా
- నకిలీ ఐటీ దాడుల్లో పాల్గొన్న సిద్ధార్థ ముఠా
కిడ్నాప్ కు పథక రచన చేసిన తర్వాత భార్గవరామ్ సూచనల మేరకు సిద్ధార్థ 15 మందిని విజయవాడ నుంచి హైదరాబాదుకు తరలించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ మనుషుల సాయంతోనే ప్రవీణ్ రావు సోదరుల నివాసాల్లో నకిలీ ఐటీ దాడులు నిర్వహించారు. కిడ్నాప్ ఘటన తర్వాత సిద్ధార్థ ముఠా సభ్యులు గోవా పారిపోగా, కొందరిని పోలీసులు పట్టుకున్నారు. సిద్ధార్థను కూడా గోవాలోనే అదుపులోకి తీసుకున్నారు.