కిడ్నాప్ చేసిన వారికి 'స్పెషల్ 26' సినిమాను చూపించిన అఖిలప్రియ సోదరుడు!
- సంచలనం కలిగించిన కిడ్నాప్ కేసు
- మరిన్ని వివరాలు వెలుగులోకి తెచ్చిన పోలీసులు
- సినిమా చూపించి కిడ్నాపర్లకు శిక్షణ
దాదాపు వారం రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. సినిమాను చూపిస్తూ, యూసుఫ్ గూడలోని ఎంజీఎం స్కూల్ లో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్ కిడ్నాపర్లకు శిక్షణ ఇచ్చాడని, ఆపై అఖిలప్రియ గ్రీన్ సిగ్నల్ తోనే ఈ తతంగమంతా సాగిందని పోలీసులు తేల్చారు. ఇందుకోసం కిడ్నాపర్లు వేసుకునేందుకు ఇందిరానగర్ లోని ఓ డ్రస్సులు అద్దెకిచ్చే దుకాణం నుంచి ఐటీ అధికారుల్లా కనిపించేలా దుస్తులను అద్దెకు తీసుకున్నారని, వారి ఐడీ కార్డులను చంద్రహాస్ తయారు చేయించారని పోలీసులు గుర్తించారు.