రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికి తీసుకెళ్లిన ఘటన చాలా దారుణం: రఘురామకృష్ణరాజు
- విజయనగరం జిల్లాలో ఘటన
- జీసస్ తల నరికితే వెంటనే స్పందిస్తారన్న రఘురామ
- హిందూ దేవుళ్ల విషయంలో ఎందుకు స్పందించరని ఆగ్రహం
- హిందువులంటే అంత చులకనా అంటూ సీఎంను ప్రశ్నించిన వైనం
'మీకు హిందువులంటే అంత చులకనా?' అంటూ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ ను ప్రశ్నించారు. హిందూ దేవాలయాలు, విగ్రహాలపై దాడులకు పాల్పడే వారిని పట్టుకునేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ సర్కారు వచ్చాక వరుసగా జరుగుతున్న సంఘటనలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు.