జనసైనికురాలి తల్లి వైద్య ఖర్చులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
- పాముకాటుకు గురైన జనసేన కార్యకర్త తల్లి
- ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స
- ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనసైనికురాలు
- స్పందించిన పవన్ కల్యాణ్
అయితే, తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఆమె చికిత్స పొందుతుండగా, లక్ష్మీప్రసన్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం పవన్ కల్యాణ్ కు తెలిసింది. ఆయన వెంటనే స్పందించి లక్ష రూపాయల సాయం ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాదులోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ లక్ష రూపాయల చెక్ ను లక్ష్మీప్రసన్నకు అందించారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.