ఆ విషయం నన్ను ఎంతో భయపెట్టింది: సినీ హీరో రామ్
- ఈ ఏడాది నా జీవితంలో మర్చిపోలేని ఘటనలు చోటు చేసుకున్నాయి
- లాక్ డౌన్ వల్ల కుటుంబంతో సమయాన్ని గడిపాను
- అమ్మకు, సోదరుడికి కరోనా రావడంతో భయమేసింది
ఈ ఏడాది తన జీవితం అనుకున్నంత సాఫీగా జరగలేదని రామ్ తెలిపాడు. తన సోదరుడు, అమ్మ కరోనా బారిన పడటంతో... తాను ఎంతో భయపడ్డానని చెప్పాడు. చాలా బాధపడ్డానని తెలిపాడు. తన సోదరుడిలో కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించాయని, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడని చెప్పాడు. కరోనాకు ఇంకా వ్యాక్సిన్ రాలేదనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలని, కొత్త సంవత్సరంలో కూడా జాగ్రత్తగా ఉండాలని కోరాడు.