తన పెళ్లి అంటూ వస్తోన్న వార్తలను ఖండించిన యంగ్ హీరో అల్లు శిరీష్
- తన కంటే ముందు అల్లు శిరీష్ పెళ్లి జరుగుతుందన్న సాయితేజ్
- త్వరలోనే అల్లు శిరీష్ పెళ్లి అని అభిమానుల్లో చర్చ
- సాయితేజ్ సరదాగా అలా చెప్పి ఉంటాడన్న శిరీష్
- అందరూ ఆ మాటలను సీరియస్‌గా తీసుకున్నారని ట్వీట్
సాయితేజ్ చేసిన వ్యాఖ్యలు, నెటిజన్లు జరుపుతోన్న చర్చపై ట్విట్టర్ ద్వారా స్పందించిన అల్లు శిరీష్ తన పెళ్లి వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. సాయితేజ్ సరదాగా అలా చెప్పి ఉంటాడని, దీంతో అందరూ ఈ మాటలను సీరియస్‌గా తీసుకున్నారని చెప్పాడు. పెళ్లి విషయంలో తన తల్లిదండ్రుల నుంచి తనపై ఒత్తిడి లేదని చెప్పాడు. ఒకవేళ తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే తానే చెబుతానని తెలిపాడు.