మెగా ఫ్యామిలీలో మగవాళ్లందరూ ఒకే ఫ్రేములో... వైరల్ అవుతున్న పిక్ ఇదే!
- నిహారిక పెళ్లికి తరలివచ్చిన మెగా జనం
- ఉదయ్ పూర్ లో నిహారిక, చైతన్య వివాహం
- గ్రూప్ ఫొటో తీయించుకున్న చిరంజీవి, పవన్ తదితరులు
- ఫొటోలో కనిపిస్తున్న బన్నీ, చరణ్
- అందరికంటే పొడవుగా అకీరా
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు ఒకే ఫ్రేములో ఉండడం అభిమానులను సంతోషానికి గురిచేస్తోంది. ఈ ఫొటోలో అల్లు అరవింద్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్, శిరీష్, వెంకట్, కల్యాణ్ దేవ్ తదితరులున్నారు.
ఇక, ఈ ఫొటోలో ఉన్న అందరిలోకి పొడగరి మాత్రం పవన్ కల్యాణ్ తనయుడు అకీరానే. చిన్న వయసులోనే ఆరడుగులకు పైగా పొడవు పెరిగిన అకీరా ఈ గ్రూప్ ఫొటోలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాడు. అకీరా హైట్ పై సోషల్ మీడియాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య చర్చ నడుస్తోంది.