మరో రికార్డు కొట్టిన అల్లు అర్జున్ సినిమా!
- త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో'
- సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్టయిన సినిమా
- డిజిటల్ హక్కులు పొందిన ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్
- ఈ ఏడాది దక్షిణాది చిత్రాల 'టాప్ 10' తొలి స్థానం
తాజాగా ఈ 'అల వైకుంఠ పురములో' చిత్రం మరో రికార్డు కూడా సాధించింది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ రేటు ఆఫర్ చేసి అప్పట్లోనే సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో వీక్షకులు అత్యధికంగా చూసిన దక్షిణ భారత చిత్రాలలో ఈ చిత్రం మొదటి స్థానంలో నిలిచింది.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎక్కువమంది చూసిన టాప్ 10 చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇందులో తొలి స్థానంలో 'అల వైకుంఠపురములో' సినిమా నిలవగా.. ఆ తర్వాతి స్థానాలలో దుల్ఖర్ సల్మాన్ నటించిన తమిళ సినిమా 'కన్నుమ్ కన్నుమ్ కొల్లయిదితాల్' (తెలుగులో కనులు కనులు దోచాయంటే), మలయాళ చిత్రం 'కప్పెలా', సత్యదేవ్ నటించిన తెలుగు చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య' వున్నాయి.