కేసీఆర్ నిర్ణయాలు రైతుల పాలిట శాపాలుగా మారాయి: మురళీధరరావు
- నియంత్రిత సాగు వల్ల రైతులు నష్టపోతున్నారు
- రైతాంగం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది
- రైతుల మేలు కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు
నియంత్రిత సాగు విధానం వల్ల రైతులు నష్టపోతున్నారని మురళీధరరావు దుయ్యబట్టారు. ఫసల్ భీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదని విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలను పెంచి దోచుకున్నారని చెప్పారు. రుణమాఫీ చేయలేదని, సబ్సిడీలు ఇవ్వడం లేదని అన్నారు. రైతాంగం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి పూర్తిగా పెరిగిపోయిందని మురళీధర్ రావు అన్నారు. కొత్త చట్టాల వల్ల తెలంగాణ రైతులు తమ పంటను మధ్యప్రదేశ్ లో అమ్ముకోవచ్చని... తాను అమ్మిస్తానని చెప్పారు. దేశంలో ఉన్న ఏ రైతైనా మధ్యప్రదేశ్ లో పంట అమ్ముకోవచ్చని అన్నారు.