మళ్లీ తెలుగులోకి వస్తున్నా... మీ ఆశీస్సులు కావాలి: సిద్ధార్థ్
- సుదీర్ఘ కాలం తర్వాత టాలీవుడ్ లో సిద్ధార్థ్ రీఎంట్రీ
- చివరిగా 'జబర్దస్త్' చిత్రంలో హీరోగా నటించిన సిద్ధార్థ్
- తాజాగా 'మహాసముద్రం'లో లీడ్ రోల్
తాజాగా, 'మహాసముద్రం'తో రీఎంట్రీ ఇస్తున్న సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు కోరుకుంటున్నాడు. ఎనిమిదేళ్ల అనంతరం మళ్లీ ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నానని తెలిపాడు. వచ్చే నెల నుంచి సెట్స్ పై అడుగుపెడుతున్నానని, అద్భుతమైన టీమ్ తో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాని వెల్లడించాడు. మళ్లీ తెలుగులోకి వస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ పోషిస్తున్న 'మహాసముద్రం' చిత్రంలో అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు.