హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల
- ఇటీవలే కరోనా బారినపడిన హీరో రాజశేఖర్
- హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స
- రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ ఇస్తున్నట్టు బులెటిన్ లో వెల్లడి
నటుడు రాజశేఖర్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ, సైటోసార్బ్ థెరపీ ఇస్తున్నామని వివరించారు. రాజశేఖర్ ను తమ వైద్యుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని డాక్టర్ రత్నకిశోర్ తాజా హెల్త్ బులెటిన్ లో తెలిపారు.