తెలుగు హీరోలు పారితోషికాన్ని తగ్గించుకున్నారన్న భారతీ రాజా.. తమిళ నటులూ తగ్గించుకోవాలని పిలుపు
- పారితోషికంలో 30 శాతం తగ్గించుకోవాలి
- ఆరు నెలలుగా సినిమాలను విడుదల చేయలేకపోతున్నాం
- నిర్మాతలు కష్టాలు పడుతున్నారు
ఆరునెలలుగా సినిమాలను విడుదల చేయలేక నిర్మాతలు పడుతున్న కష్టాలను అర్థం చేసుకోవాలని కోరారు. నిర్మాణంలో వున్న సినిమాల షూటింగ్‌లు బంద్ కావడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారని చెప్పారు. నిర్మాతలను వెంటనే ఆదుకోవాల్సిన బాధ్యత సినీరంగానికి చెందిన కళాకారులందరిపైనా ఉందని ఆయన తెలిపారు. 6 నెలలుగా షూటింగ్‌లు ఆగిపోయిన సినిమాల్లో నటిస్తున్న నటీనటులు, దర్శకులు ఒప్పందంలో పేర్కొన్న పారితోషికంలో కనీసం 30 శాతం తగ్గించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.