దసరా తర్వాత రంగంలోకి దిగనున్న 'వకీల్ సాబ్'!
- ఇటీవలే మొదలైన 'వకీల్ సాబ్' షూట్
- అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ
- దసరాకి సినిమా నుంచి అప్ డేట్
- సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు
అలాగే, పవన్ కల్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం షూటింగ్ కూడా ఇటీవల హైదరాబాదులో మొదలైంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం అంజలి, నివేద థామస్ తదితరులు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇక విజయదశమి పండగ తర్వాత నుంచి పవన్ కల్యాణ్ కూడా ఈ చిత్రం షూటింగులో పాల్గొంటారని తాజా సమాచారం. లాక్ డౌన్ కి ముందే ఆయన షూటింగ్ చాలా పూర్తవడంతో, ఇక కొన్ని రోజులు షూటింగ్ చేస్తే ఆయన పార్ట్ పూర్తవుతుంది.
ఇదిలావుంచితే, దసరా పండగకి ఈ చిత్రం నుంచి ఒక అప్ డేట్ వస్తుందని అంటున్నారు. మరి అది టీజరా? లేక మరొకటా? అన్నది త్వరలో తెలుస్తుంది. పవన్ చాలా కాలం గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. వచ్చే సంక్రాంతి పండుగకు దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.