నేను ఎంత ఒంటరిదాన్నో నాకు తెలిసింది: శ్రుతి హాసన్
- కరోనా వల్ల ఈ ఏడాది ఎంతో నేర్చుకున్నా
- మనుషులు, మానవత్వం గురించి తెలుసుకున్నా
- నా బలాలు, బలహీనతల గురించి నేర్చుకున్నా
మనుషుల గురించి, మానవత్వం గురించి, మన బలాలు, బలహీనతల గురించి ఈ సంవత్సరం ఎంతో నేర్చుకున్నానని శ్రుతి తెలిపింది. తాను ఎంత ఒంటరి వ్యక్తినో, తనకు మనుషులు ఇచ్చే విలువ ఏంటో తెలుసుకున్నానని చెప్పింది. ముఖ్యంగా తనను తాను ఎలా ప్రేమించుకోవాలనే విషయాన్ని నేర్చుకున్నానని తెలిపింది. తాను ఎక్కడ ఉన్నానో తెలుసుకునేందుకు ఈ సమయం ఎంతో ఉపయోగపడిందని చెప్పింది. సినీ ప్రపంచం, కళ, అవి తనకిచ్చే ప్రేమ గురించి తెలుసుకున్నానని తెలిపింది.