'వకీల్ సాబ్' షూటింగులో జాయిన్ అయిన కథానాయిక!
- హైదరాబాదులో 'వకీల్ సాబ్' షూటింగ్
- ఈ రోజు జాయిన్ అయిన నివేద థామస్
- త్వరలో జాయిన్ కానున్న పవన్
- అంజలి, శ్రుతిహాసన్ ల కీలక పాత్రలు
ప్రస్తుతం పవన్ కల్యాణ్ లేని సన్నివేశాలను ఇతర నటీనటులపై చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న కథానాయిక నివేద థామస్ కూడా ఈ రోజు ఈ చిత్రం షూటింగులో జాయిన్ అయింది. ఈ విషయాన్ని నివేద సోషల్ మీడియాలో వెల్లడించింది. 'తిరిగి షూటింగుకి రావడం బాగుంది..' అంటూ నివేద పోస్ట్ పెట్టింది.
కాగా, హీరో పవన్ కల్యాణ్ కూడా త్వరలోనే ఈ చిత్రం షూట్ లో పాల్గొంటారని తెలుస్తోంది. కథానాయికలు అంజలి, శ్రుతి హాసన్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.