ఎంతోమంది కరోనా బాధితులకు సేవ చేసిన రాధిక అదే ఆసుపత్రిలో మరణించడం బాధాకరం: లోకేశ్
- తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ప్రమాదం
- బిల్డింగ్ పెచ్చులు ఊడి కిందపడిన ఘటనలో ఓ ఉద్యోగిని మృతి
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన లోకేశ్
ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని తెలిపారు. కొవిడ్ ఆసుపత్రుల్లో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడంలేదని లోకేశ్ ఆరోపించారు. పూర్తికాని భవనంలో కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.