బిగ్ బాస్ కు అనుష్క గెస్ట్ గా రాకపోవడానికి ఇదే కారణమట!
- కరోనా వల్ల రిస్క్ తీసుకోకూడదనే భావనలో అనుష్క
- బిగ్ బాస్ కు వెళ్లకపోవడానికి కూడా కారణం ఇదే
- 'నిశ్శబ్దం' సినిమాకు ఆన్ లైన్ లోనే ప్రమోషన్ చేస్తానన్న స్వీటీ
కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని... మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని అనుష్క తెలిపింది. బిగ్ బాస్ లో పాల్గొనాలంటే అక్కడ ఎక్కువ మందిని కలవాల్సి ఉంటుంది. అందుకే బయటకు వెళ్లకూడదని ఆమె నిర్ణయించుకుంది. తన తాజా చిత్రం 'నిశ్శబ్దం' ప్రమోషన్ కోసం బిగ్ బాస్ కు ఆమె రావాల్సి ఉంది. అయితే, ఆన్ లైన్ లోనే తాను ప్రమోషన్ చేస్తానని ఆమె కండిషన్ పెట్టిందట.