సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'రాధే శ్యామ్'పై ట్వీట్ చేసిన పూజ హెగ్డే
- రాజకీయ నాయకుడిగా సూర్య
- నెగటివ్ పాత్రలో మలయాళ భామ
* తమిళ చిత్ర కథానాయకుడు సూర్య మరోసారి రాజకీయ నాయకుడి పాత్రలో నటించనున్నాడు. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. విజయదశమికి షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రంలో సూర్య రాజకీయ నాయకుడిగా నటిస్తాడట. గతంలో 'ఎన్.జి.కె' చిత్రంలో ఇలా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించాడు.
* మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ ఓ తెలుగు సినిమాలో నెగటివ్ టచ్ తో కూడిన పాత్రను పోషిస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో పూర్ణ ఓ కీలకమైన పాత్రను పోషిస్తోందని, ఇది నెగటివ్ టచ్ తో సాగుతుందని తెలుస్తోంది.