ఏడేళ్ల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇస్తున్న లవర్ బోయ్!
- తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్న సిద్ధార్థ్
- 'మహాసముద్రం' సినిమా ద్వారా రీఎంట్రీ
- మరో హీరోగా నటిస్తున్న శర్వానంద్
'మహాసముద్రం' చిత్రంలో సిద్ధార్థ్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మరో హీరోగా శర్వానంద్ నటించనున్నాడు. ఈ సినిమాకు ఆర్ఎక్స్100ని తెరకెక్కించిన అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సుంకర రామబ్రహ్మం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ తమ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. సిద్ధార్థ్ కు సంబంధించి వీడియోను పోస్ట్ చేసింది.